కిడారి కుటుంబానికి రూ. 42 లక్షలు

మావోల చేతిలో హత్యకు గురైన అరకు ఎమ్మెల్యే కిడారి కుటుంబానికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం రూ. 42 లక్షల పరిహారం అందనుంది. ప్రభుత్వానికి పంపే నివేదికలో అధికారులు ఈ ప్రతిపాదన చేసినట్టు తెలుస్తోంది. మరణించిన ఎమ్మెల్యేల కుటుంబంలో డిగ్రీ చదివిన పిల్లలుంటే వారికి డిప్యూటీ కలెక్టర్ హోదాతో కూడిన ఉద్యోగంలో ప్రభుత్వం లోగడ నియమించేది. ఇదే విధానాన్ని కిడారి కుటుంబానికి కూడా
వర్తింపజేయవచ్చునని భావిస్తున్నారు.

ఇక నక్సల్స్ కాల్పుల్లో తానూ ప్రాణాలు కోల్పోయిన మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ కుటుంబానికి రూ. 12 లక్షల పరిహారం చెల్లిస్తారని అంటున్నారు. ఇవికాక..ప్రభుత్వం అదనపు ప్రయోజనాలు ప్రకటిస్తే ఆ మేరకు ఈ ఇద్దరి కుటుంబాలకు వాటిని అందజేయనున్నారు.

Related News