టాలీవుడ్ హీరోయిన్ భర్త పొలిటికల్ ఎంట్రీ!

సినిమా పరిశ్రమ నుంచి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం ఇవ్వాళా రేపూ సహజం! వెండితెర మీద సంపాదించుకున్న క్రేజ్‌ని పొలిటికల్‌గా సొమ్ము చేసుకోవడం అనేది ఒక కళ కూడా! పైగా.. అప్పటికే పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ వున్న స్టార్లయితే.. పాలిటిక్స్‌లో రెడీమేడ్ రెడ్‌‌కార్పెట్ కంపల్సరీ! అదే క్రమంలో బాలీవుడ్ హీరో రితేష్ దేశ్‌ముఖ్ పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్ధం చేసుకున్నాడు. తండ్రి విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసిన ఆయన 2012లో మరణించారు. తర్వాత సినిమాలతోనే బండి నెట్టుకొస్తున్న కొడుకు రితేష్.. ఇక తన ‘సినిమా’ అయిపోయిందని తెలుసుకుని రాజకీయాల వైపు చూస్తున్నట్లు సమాచారం.

సొంత నియోజకవర్గం లాతూర్ నుంచి 2019 పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడానికి రితేష్ ‘సై’ అంటున్నాడు. కాంగ్రెస్ హైకమాండ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. తెలుగుతో పాటు దక్షిణాది ఇండస్ట్రీల్లో ఓ రేంజ్‌లో వెలిగిన స్టార్ హీరోయిన్ జెనీలియాను పెళ్లాడిన రితేష్.. బాలీవుడ్‌లో కామెడీ హీరో వేషాలేసుకుంటూ ఇన్నాళ్లూ టైంపాస్ చేశాడు. 2019 తర్వాత పార్లమెంటులో సినిమా నడిపించాలన్నది అతడి ప్లాన్ కావొచ్చు.

Related News