‘రైజింగ్ కాశ్మీర్’ పత్రిక ఎడిటర్ హత్య

జమ్మూకాశ్మీర్‌లో దారుణం జరిగింది. గురువారం సాయంత్రం ‘రైజింగ్ కాశ్మీర్’ పత్రికా ఎడిటర్ షుజాత్ బుఖారిని కాల్చిచంపారు గుర్తు తెలియని వ్యక్తులు. శ్రీనగర్‌లోని తన ఆఫీస్‌ నుంచి ఆయన బయటకు వస్తున్న సమయంలో బైక్‌పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆయన అక్కడికక్కడే మృతిచెందారు. బుఖారీ సెక్యూరిటీ ఆఫీసర్ కూడా గాయపడ్డారు. ఆయన్ని ఆసుపత్రికి తరలించి, చికిత్స చేయిస్తున్నారు.

ఆఫీస్ నుంచి ఇఫ్తార్ విందు కోసం మరొక ప్రాంతానికి బుఖారీ వెళ్తుండగా ఈ దాడి జరిగింది. ఈ ఘటనను జమ్మూ-కాశ్మీరు సీఎం మెహబూబా ముఫ్తీ తీవ్రంగా ఖండించారు. ఆయన హఠాన్మరణం పట్ల తాను దిగ్భ్రాంతికి గురైనట్లు పేర్కొన్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపారు.

చాలాకాలం తర్వాత కాశ్మీర్‌లో జర్నలిస్ట్‌పై దాడి చేయడం ఇదే తొలిసారి. 2000 ఏడాదిలో షుజాత్‌ మీద దాడి జరిగిన తర్వాత అక్కడి ప్రభుత్వం ఆయనకు పోలీసు రక్షణ ఇచ్చిన విషయం తెల్సిందే!

Related News