రేవంత్‌ అరెస్ట్‌కి రంగంసిద్ధం!

మాజీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డికి కష్టాలు తప్పేటట్టు లేదు. ఆయన అరెస్ట్‌కి రంగం సిద్ధమైంది. జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో జరిగిన అవకతవకల కేసులో ఆయనకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. 15 రోజుల్లో హాజరుకావాలని అందులో పేర్కొన్నారు. రేవంత్ సహా 13 మందికి ఈ నోటీసులు ఇచ్చారు. ఎన్నికల బిజీలో వున్నందున విచారణకు రాలేనని లేఖ రాశారు రేవంత్. తప్పుడు పత్రాలతో ఇళ్ల స్థలాలు కేటాయించారని రేవంత్‌పై ఆరోపణలున్నాయి.

Related News