అసలేకోతి.. కల్లుతాగింది..ఆపైన తేలుకుట్టింది.. కాస్కో కేసీఆర్

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై తనదైన శైలిలో తాజాగా దండెత్తారు టీ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి. సెటైర్ల మీద సెటైర్లు విసురుతూ కేసీఆర్ పై మాటల తూటాలు పేల్చారు. ప్రభుత్వ రద్దు నాటి నుంచి కేసీఆర్‌ తీరు కల్లు తాగిన కోతికి తేలు కుడితే గెంతినట్టుందన్నారు. యమధర్మారాజు దగ్గరకు పోయి అక్కడ గోలీలు ఆడి మరి వెనక్కు వచ్చి తెలంగాణ తెచ్చినట్లు చెబుతున్నారంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబు పై విమర్శలు చేస్తూ తెలంగాణ సమాజాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఎన్నికల పోరు టీఆర్ఎస్ – చంద్రబాబు మధ్య ఉన్నట్టు చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ అంటే భయం వల్లే కేసీఆర్.. చంద్రబాబును విమర్శలు చేస్తూ వ్యూహాత్మక ఎత్తుగడలు చేస్తున్నారని విమర్శించారు.

 

కేసీఆర్‌ ఉద్యమం ప్రారంభించాకే ఆయన కేంద్రమంత్రి, సీఎం, ఛానల్‌, పేపర్‌, కోట్ల ఆస్తులు సంపాదించారన్నారు. అలాగే హరీష్‌, కేటీఆర్‌ మంత్రులయ్యారని, కూతురు కవిత ఎంపీ, సడ్డకుని కొడుకు రాజ్యసభ సభ్యుడయ్యారని విమర్శించారు. తన కుటుంబసభ్యులపై ఉన్న కేసులు ఎత్తివేసి, తెలంగాణ కోసం పోరాడిన వాళ్లపై కేసులు అలాగే ఉంచడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్‌ అని చెప్పలేక సెంటిమెంట్‌తో ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. కేసీఆర్‌ భాష ఊరిలో బర్లు కాసేవాడు కూడా మాట్లాడటం లేదన్నారు. అన్నింట్లోనూ ఆంధ్రవాళ్లను భాగస్వాములుగా చేస్తున్న కేసీఆర్.. దీనికేం చెబుతావంటూ వరుస దండకం అందుకున్నారు.. రేవంత్ ఇంకేమంటున్నారో ఆయన మాటల్లోనే..

Related News