అకీరా విత్ పవన్.. కేరాఫ్ బెజవాడ! రేణు ఇచ్చిన క్లారిటీ !

‘మా వాడి ఇండివిడ్యువాలిటీని దెబ్బతీయకండి.. అకీరాకి జూనియర్ పవన్ కళ్యాణ్ ట్యాగ్ తగిలిస్తే ఊరుకునేది లేదు..’ అంటూ హెచ్చరించింది పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్. అయితే.. ఇలా చెప్పిన నాలుగు రోజులకే.. బెజవాడలో పవన్‌తో కలిసి అకీరా మీడియా కెమెరాకు దొరికాడు. ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పవన్, అతడి కొడుకు అకీరా ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంతో మళ్ళీ రేణూ మీద వాలిపోయారు నెటిజన్లు.

చెప్పిందేంటి.. చేస్తున్నదేంటి అంటూ ట్రోలింగ్ షురూ అయ్యింది. ఈ తాకిడిని తట్టుకోలేక.. రేణుదేశాయ్ ట్విట్టర్లో సంజాయిషీ లాంటిది ఇచ్చుకోవాల్సి వచ్చింది. స్కూల్ సెలవుల కారణంగా కొన్నిరోజులు నాన్నతో కలిసి ఉంటానంటే నేనే పంపించా..! ఇక ట్రోలింగ్ ఆపండి.. అంటూ పరోక్షంగా వేడుకుంది. సెలబ్రిటీల జీవితాలంటే ఇంతే మరి! పబ్లిక్ లైఫ్‌లో కొచ్చిన తర్వాత.. ‘ప్రైవేట్ ఇష్యు’లు అంటూ ఏమీ వుండవు. పవన్‌కళ్యాణ్ కుటుంబ వ్యవహారాల మీద ఇలా ‘నిరంతర దాడి’ తప్పదేమో!

Related News