రెజీనా పెళ్లి, ఎప్పుడు, ఎలా?

టాలీవుడ్‌లో సినిమాలు లేకపోయినా ఏదోవిధంగా హంగామా చేస్తూనే వుంటుంది తమిళ బ్యూటీ రెజీనా. ఐదేళ్లపాటు తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సుందరి, ఆఫర్స్ లేకపోవడంతో కోలీవుడ్ వైపు ఫోకస్ చేసింది. 28 ఏళ్ల ఈ బ్యూటీకి ఇప్పుడు చేతిలో నాలుగైదు చిత్రాలున్నాయి. హారర్‌ నేపథ్యంలో తెరకెక్కిన ‘7’ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. మూవీ ప్రమోషన్ నేపథ్యంలో మీడియాతో ముచ్చటించిన రెజీనా, తాను దేనికైనా రెడీ అంటోంది.

మ్యారేజ్ చేసుకోవాలనే ఆలోచ‌న అయితే వుందని, పెళ్లి చేసుకోవాల్సిన వయసులోనే వున్నానని చెబుతోంది. కల్యాణ ఘడియ ఎప్పుడనేది మాత్రం తెలియదంటోంది. ఈ లెక్కన రెండు మూడేళ్లలో రెజీనా పెళ్లైపోవడం ఖాయమన్నమాట. అన్నట్లు ఆ మధ్య టాలీవుడ్‌కి చెందిన ఓ హీరోతో క్లోజ్ రిలేషన్ వుందంటూ జోరుగా ప్రచారం సాగింది. మరి ఆ విషయం ఎంతవరకు వచ్చినట్టు అంటూ ప్రశ్నలు రైజ్ చేస్తున్నారు ఫ్యాన్స్.

Related News