ఎన్నికలపై కొత్త సస్పెన్స్!

తెలంగాణాలో ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు రాష్ట్ర ఎన్నికల అధికారి రజత్ కుమార్. రాజకీయ పార్టీల సమక్షంలో ఈవీఎంలను పరిశీలిస్తున్నామని, నిబంధనల ప్రకారం ఎలక్షన్స్ 6 నెలల్లో నిర్వహించాల్సి ఉంటుందని ఆయన శుక్రవారం మీడియాకు తెలిపారు. అయితే కలెక్టర్లు, అధికారులు ఇప్పటినుంచే సమన్వయంతో పని చేస్తున్నారని, కేంద్ర ఎన్నికల బృందం త్వరలో మళ్ళీ రానుందని చెప్పారు.

ఎన్నికల ఏర్పాట్లపై కేంద్ర ఎన్నికల సంఘం సంతృప్తి చెందిందని రజత్ కుమార్ అన్నారు. పైగా ఏర్పాట్లను ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తుందని అన్నారు. ప్రతి గ్రామంలో ఓటర్లకు అవగాహనా కార్యక్రమాలు చేపడుతున్నట్టు వెల్లడించారు. ఎన్నికలను కచ్చితంగా ఎప్పుడు నిర్వహించాలన్న దానిపై ఈసీ తుది నినిర్ణయం తీసుకుంటుంది..ఓటర్ల నమోదుకు సమయం సరిపోదని పలు రాజకీయ పార్టీలు చెప్పాయి. అయితే గత అనుభవాల దృష్ట్యా సమయం సరిపోతుందని ఈసీ భావిస్తోంది అని ఆయన చెప్పారు. ఇటీవలే ఢిల్లీ వెళ్ళిన రజత్ కుమార్ ఈసీతో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఢిల్లీ సెంట్రల్ ఆఫీస్ నుంచి ఆదేశాలు వచ్చేదాకా తమకూ స్పష్టత వచ్చే అవకాశం లేదని రజత్ చెప్పారు. తామైతే అన్ని రకాల ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నామని, ప్రభుత్వ వర్గాలతో టచ్ లో ఉన్నామని క్లారిటీ ఇచ్చారు.

Related News