మళ్లీ వార్తల్లో రష్మిక, చెరగని తీపి గుర్తు

హీరోయిన్ రష్మిక మందన్నా మళ్లీ వార్తల్లోకి వచ్చేసింది. గ్లామర్ ఇండస్ర్టీలో కెరీర్ ఉపందుకోవడంతో మ్యారేజ్‌ని సైతం పక్కన పెట్టేసింది. కాకపోతే ఈమె మళ్లీ లవ్‌లో పడిందనే వార్తలు జోరందుకున్నాయి. ఇంతకీ ఎవరు అతడు? రీసెంట్‌గా ‘దేవదాస్’ ఆడియో వేడుకకు రష్మిక హాజరైంది. ఐతే, ఆమె చేతి మీదున్న టాటూ గురించి సోషల్‌మీడియాలో ఆసక్తికరమైన ప్రచారం సాగుతోంది.

చేతిపై ఇర్రిప్లేసబుల్ అని రాసుంది. సింపుల్ చెప్పాలంటే భర్తీ చేయలేనిదని అర్థం. రక్షిత్‌తో ప్రేమలో వున్నప్పుడు రష్మిక ఈ టాటూ వేయించుకున్నట్లు ఫిల్మ్ ఇండస్ర్టీలో చెప్పుకుంటున్నారు. మ్యారేజ్ క్యాన్సిల్ తర్వాత టాటు వ్యవహారం బయటపడకుండా ఆమె జాగ్రత్తపడింది. కానీ, కెమెరా కళ్ల నుంచి ఆమె తప్పించుకోలేపోయింది. మొత్తానికి టాటు గురించి రష్మిక ఏమంటుందో చూడాలి.

Related News