టీఆర్ఎస్ ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ : రాములు

టీఆర్ఎస్ పార్టీ ఒక ప్రైవేటు లిమిటెడ్‌ కంపెనీ అంటూ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు ఎమ్మెల్సీ రాములు నాయక్‌. ఆపార్టీలో ప్రజాస్వామ్యం, ఆత్మగౌరవం లేనే లేవని ఆరోపించారు. టీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన అనంతరం మీడియాతో మాట్లాడిన రాములు నాయక్ .. తాను గిరిజనుడైనందు వల్లే కనీసం షోకాజ్‌ నోటీసు కూడా ఇవ్వకుండానే పార్టీ నుంచి తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజనులకు రిజర్వేషన్‌ కోరినందుకే తనను పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తారా అంటూ ఒక దశలో తీవ్ర ఉద్వేగానికి గురై కంటతడి పెట్టుకున్నారు. గిరిజనులకు, దళితులకు ఇస్తామన్న భూమి సంగతి ఏమైందని? నిలదీశారు. ఎస్టీలకు రిజర్వేషన్లు పెంచుతామని ఉద్యమం సమయంలో కేసీఆర్‌ ఇచ్చిన హామీ తుంగలోతొక్కారని విమర్శించారు. డీఎస్సీ నిర్వహించమంటే పట్టించుకోలేదని, గిరిజన నిరుద్యోగులకు న్యాయం జరగలేదని చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ కు గిరిజనులు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

Related News