ఎన్టీఆర్ బయోపిక్‌: రామోజీరావు రోలేంటి?

రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘ఎన్టీఆర్ బయోపిక్’ మూవీ షూట్ జరుగుతోంది. బుధవారం నాడు సెట్స్‌కి అనుకోని అతిధి వచ్చారు. ఆయన ఎవరోకాదు రామోజీ గ్రూప్ అధినేత రామోజీరావు. దాదాపు అరగంట సేపు యూనిట్‌తో గడిపారు. డైరెక్టర్ క్రిష్‌‌తో కూర్చుని ప్రత్యేకంగా మాట్లాడారు. కార్పొరేట్, మీడియా వ్యవహారాలతో  ఎప్పుడూ  బిజీగావుండే రామోజీరావు, ఇలా సినిమా సెట్స్‌కి రావడం అరుదైన విషయం. ఇదే విషయాన్ని ఎన్టీఆర్ బయోపిక్ డైరెక్టర్ క్రిష్ ట్విట్టర్ ద్వారా పేర్కొన్నాడు. రామోజీరావు లాంటి లెజెండరీ పర్సనాలిటీ తన మూవీ సెట్స్ వద్దకు రావడం గొప్ప అనుభూతినిచ్చిందన్నాడు క్రిష్.

తనతోపాటు సినిమా యూనిట్ అంతా ఈ ఫీల్‌ని ఆస్వాధించిందని చెబుతూ రామోజీరావుకు థ్యాంకింగ్ ట్వీట్ చేశాడు జాగర్లమూడి రాధాకృష్ణ. ఇదిలావుంటే దాదాపు అరగంట సేపు డైరెక్టర్‌తో రామోజీ ముచ్చట్లాడిన విషయాన్ని నెటిజన్లు సీరియస్‌గా తీసుకున్నారు. బయోపిక్‌లో తన రోల్ మీద డైరెక్టర్ నుంచి రామోజీరావు క్లారిటీ తీసుకున్నారని కొందరంటున్నారు. ఎన్టీఆర్ రాజకీయ ప్రస్థానంలో రామోజీరావు పాత్ర ఏమిటన్నది తెలుగు జనాబాకు సుపరిచితమే!

READ ALSO

Related News