”చంద్రబాబుతోనే టీడీపీకి ఫుల్‌స్టాప్”

తెలుగు రాష్ర్టాల్లో బీజేపీ యాక్షన్ ప్లాన్ మొదలుపెట్టేసింది. సార్వత్రిక ఎన్నికలకు సమయం ఏడాది వుండగానే రంగంలోకి దిగేసింది ఏపీ బీజేపీ ఇన్‌ఛార్జ్ రామ్‌మాధవ్ టీమ్. ఇటు ఏపీ, అటు తెలంగాణకు కామన్ పాయింట్‌ని టచ్ చేసింది. తెలుగు రాష్ర్టాల్లో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే, వారసత్వ రాజకీయాలకు స్వస్తి పలుకుతామన్నారు రామ్‌మాధవ్. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణ శనివారం బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో పార్టీ కేంద్ర కమిటీ నుంచి ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్, సిద్దార్థనాథ్‌సింగ్ గుంటూరు వచ్చారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన రామ్‌మాధవ్, టీడీపీ సర్కార్‌పై బాణాలు సంధించారు. కాంగ్రెస్‌కు వ్యతిరేక శక్తిగా ఆనాడు ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారని, కానీ.. ఇప్పుడు అదే పార్టీతో చంద్రబాబు దోస్తీ కట్టడం ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుందన్నారు. టీడీపీ వారసత్వ రాజకీయాలకు స్వస్తి పలుకుతామని, మహనాడు ఫ్లెక్సీలన్నీ వారసత్వంతో నిండి పోయాయని ఎద్దేవా చేశారు. కన్నా నాయకత్వంలో ఏపీలో నూతన ఒరవడి సృష్టించబోతున్నామన్నారు. ఏపీకి ఇచ్చిన అన్ని హామీలను బీజేపీ నెరవేరుస్తుందన్నారు.

READ ALSO

Related News