ఇదే వర్మ ‘భైరవ గీత’

డైరెక్టర్ రామ్‌గోపాల్‌ వర్మ లేటెస్ట్ మూవీ ‘భైరవ గీత’ దీనికి సంబంధించి మోషన్ పోస్టర్‌ని విడుదల చేశాడు. తొలుత లవ్‌‌స్టోరీ అని చూపించినప్పటికీ.. ‘దొరల పొగరు పరాకాష్టకి చేరినప్పుడు బానిసల ధైర్యం కూడా పరాకాష్టకి చేరుతుంది’ అనే ట్యాగ్‌‌లైన్‌ చూపించాడు. ఇది యాక్షన్‌ ఫిల్మ్ అని వర్మ తేల్చేశాడు.

ఈ చిత్రానికి వర్మ డైరెక్టర్ కాకపోయినా ఆ ఛాయలు కనిపిస్తున్నాయి. కన్నడ, తెలుగు రానున్న ఈ చిత్రానికి సిద్ధార్థ అనే వ్యక్తిని దర్శకుడిగా వర్మ పరిచయం చేస్తున్నాడు. ధనంజయ అలియాస్‌ దాలి అనే కన్నడ నటుడు ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ఆర్జీవీతోపాటు భాస్కర్‌‌రాశి భైరవ గీతాన్ని నిర్మిస్తున్నారు.

 

Related News