ఢిల్లీలో దీక్షితులు.. స్వామి చేతికి టీటీడీ ‘స్టఫ్’

టీటీడీ వ్యవహారాలపై సీబీఐ కన్నేసిందా? మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు చేసిన ఆరోపణలపై దర్యాప్తునకు సిద్ధమవుతోందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. వివాదాలకు వేదికగా మారుతోన్న తిరుమల తిరుపతి దేవస్థానం వ్యవహారాలపై బీజేపీ నేతలతో చర్చించేందుకు దేవాలయం మాజీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు బుధవారం ఢిల్లీకి వెళ్లారు. తొలుత ఆ పార్టీ ఎంపీ సుబ్రమణ్యస్వామితో సమావేశమైన ఆయన వివిధ అంశాలపై చర్చించారు.

అంతేకాదు వివాదాలకు సంబంధించి కీలక సమాచారం ఇచ్చినట్టు సమాచారం. దీని ఆధారంగా సుప్రీంకోర్టులో పిటిషన్ వేసేందుకు స్వామి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. టీటీడీ వ్యవహారంపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తానని, సీబీఐ విచారణ కోరతానని రెండురోజుల కిందట స్వామి తన ట్విట్టర్‌లో రాసుకొచ్చిన విషయం తెల్సిందే! ఒకవేళ స్వామి పిటిషన్‌ని సుప్రీంకోర్టు స్వీకరిస్తే టీటీడీ లొల్లి కాస్త సీబీఐ పంచాయితీకి చేరే అవకాశాలు లేకపోలేదు.

READ ALSO

Related News