ఏపీ రాజధాని బిల్డింగ్స్‌లో వాటర్ లీక్

ఎడతెరిపిలేకుండా నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఏపీ రాజధాని అమరావతి వరద నీటిలో చిక్కుకుపోయింది. రాజధాని ప్రాంతంలో నిర్మించిన కొత్త నిర్మాణాలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. అసెంబ్లీతో పాటు సెక్రటేరియేట్‌లోని మంత్రుల చాంబర్లలోకి సైతం నీరు ప్రవేశించింది. నిన్న కురిసిన భారీ వర్షంతో భవనపు గోడల నుంచి నీరు లీక్ అవుతోంది. మంత్రి గంటా శ్రీనివాసరావు చాంబర్ లోకి నీరు వచ్చి చేరింది. దానికి ఆనుకునే ఉండే వ్యక్తిగత గదిలో సీలింగ్ ఊడిపడింది. మరో మంత్రి అమర్ నాథ్ కార్యాలయంలో కూడా ఇదే పరిస్థితి ఉంది. కంప్యూటర్ ఆపరేటర్లు కూర్చునే గదిలోని సీలింగ్ నుంచి నీరుకారి రూంలోకి వచ్చింది. కాలువ శ్రీనివాసులు చాంబర్‌లోనూ లీకేజీ కనిపించింది. అటు, అసెంబ్లీ భవనంలో చాలా చోట్ల నీరు లీక్ అవుతోందని సిబ్బంది గుర్తించారు. ఇదే బిల్డింగ్ మొదటి అంతస్తులోని రిపోర్టింగ్ రూమ్, లైబ్రరీ ప్రాంతాల్లోకి నీరు చేరింది. ఇంతకుముందు భారీ వర్షాలు కురిసిన సందర్భంలోనూ అమరావతిలో నిర్మాణలోపాలు బయటపడ్డ సంగతి తెలిసిందే.

Related News