పొలిటికల్ యాక్షన్ కింగ్! రాహుల్ !

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తను రాజకీయ నాయకుడే కాదు.. అప్పుడప్పుడు యాక్షన్ కింగ్‌లా  కూడా అవతారమెత్తుతున్నారు. రాఫెల్ విమానాల ఒప్పంద విషయంలో ప్రధాని మోదీని వదిలిపెట్టేది లేనట్టు.. ఆయన వెరైటీగా యాక్షన్ చేసి చూపడం విశేషం. తాజాగా..ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి హల్చల్ సృష్టిస్తోంది.

రాఫెల్ డీల్‌పై నేను పార్లమెంటులో మోడీని ప్రశ్నించా. ఇప్పటికే 45 వేల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిన అనిల్ అంబానీ సంస్థకు ఈ డీల్‌ని ఎందుకు అప్పగించారని అడిగితే.. ఆయన కనీసం నా కళ్ళలోకి కూడా చూడకుండా. ఇలా .దిక్కులు చూశారు ‘ అంటూ  రాహుల్ చిన్నపాటి రచ్చే చేశారు.

Related News