తెలుగు రాష్ట్రాలకు రాహుల్ గ్రీన్ సిగ్నల్

వచ్చేఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు కాంగ్రెస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ. ఇప్పటికే అన్నిరాష్ర్టాలను అలర్ట్ చేసిన ఆయన.. గెలిచేవాళ్ళకే టికెట్లు ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. ఇందులోభాగంగా జులై‌లో ఏపీ, తెలంగాణల్లో సెపరేట్‌గా రెండు సర్వేలు చేయించనున్నారు. ఇందులో పైచేయి సాధించిన వాళ్ళకే సీట్లు కేటాయించనున్నారు. దీనికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేశారు రాహుల్. ఈ సర్వేల రిపోర్ట్ ఆధారంగానే ఎమ్మెల్యే, ఎంపీ నియోజకవర్గాలకు అభ్యర్థుల ఎంపిక జరగనుంది. ఈ రెండు సర్వేలు ఏకకాలంలో జరిగేవిధంగా యాక్షన్ ప్లాన్‌కి రాహుల్ అంగీకారం తెలిపినట్టు తెలుస్తోంది. తెలంగాణాలో మొత్తం 119, ఏపీలో 175 నియోజకవర్గాలకు జులై నుంచి టీపీసీసీ, ఏపీసీసీ వేర్వేరుగా సర్వేలు జరపనున్నాయి. ఎప్పుడూ పైరవీలకు పెద్దపీట వేసే కాంగ్రెస్ పార్టీ, ఈసారి ఆ ట్రెడిషన్‌ని పక్కన పెట్టాలని ఆలోచన చేస్తోంది. రెండు ప్రముఖ సంస్థల సహకారంతో జరగనున్న ఈ సర్వేలకు సంబంధించిన తుది ఫార్మాట్ సిద్ధమైంది.

Related News