అమిత్‌ దెబ్బకి అతలాకుతలం

బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు సెటైరికల్ శుభాకాంక్షలు చెప్పారు కాంగ్రెస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ. అహ్మదాబాద్ లోని అమిత్ షా డైరెక్టర్ గా ఉన్న కోపరేటివ్ బ్యాంకు, నోట్ల రద్దు వ్యవహారంలో టాప్ ప్లేస్ కొట్టేసిందంటూ ఎద్దేవా చేశారు. నోట్ల రద్దు జరిగిన తర్వాత… కేవలం ఐదు రోజుల్లోనే రూ. 750 కోట్ల పాత నోట్లను మార్చి రికార్డు సృష్టించిందన్న విషయాన్ని గుర్తు చేస్తూ ట్విట్టర్లో చలోక్తులు విసిరారు.

నోట్ల రద్దుతో దేశంలోని సామాన్య ప్రజల జీవితాలు అతలాకుతలం అయినా… అమిత్ షా బ్యాంకు మాత్రం లాభపడిందని విమర్శించారు. దీనిని ఉదహరిస్తూ ‘అమిత్ షా జీ… కంగ్రాచ్యులేషన్స్’ అంటూ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. మీరు సాధించిన విజయానికి శాల్యూట్ చేస్తున్నానంటూ కామెంట్ చేశారు. బీజేపీ సర్కారు ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన నోట్ల రద్దు సమయంలో అమిత్‌ షా డైరెక్టర్‌గావున్న అహ్మదాబాద్‌ జిల్లా సహకార బ్యాంకుకు (ఏడీసీబీ)లో అత్యధిక సంఖ్యలో డిపాజిట్లు వచ్చిన అంశాన్ని ముంబైకి చెందిన ఆర్‌టీఐ కార్యకర్త మనోరంజన్‌ ఎస్‌.రాయ్‌ పిటిషన్‌ ద్వారా రాబట్టిన సంగతి తెలిసిందే.

ఇదంతా ఒకెత్తయితే, అసలు విషయం మరోటుంది. ఈ వార్తను ప్రచురించిన ప్రముఖ ఆంగ్ల మీడియా సంస్థలు.. టైమ్స్ నౌ, న్యూస్18, ఫస్ట్ పోస్ట్, న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్ కొన్ని గంటల్లో వివరణ ఏమీ ఇవ్వకుండానే సదరు వార్తను తమ వెబ్ సైట్స్ నుంచి తొలగించేశాయి. ఇలా ఎందుకు చేశాయన్నది మాత్రం వాళ్లకే ఎరుక. బిగ్ బాస్ ప్రతిష్ట దెబ్బతీసే ఈ వార్తను ఊడపీకించింది ఆ వ్యక్తేనా, లేక వెనకున్న శక్తులా అన్నది ఒక మిస్టరీ.

గతంలో అమిత్ షాకు వ్యతిరేకంగా వచ్చిన వార్తలు కొన్ని గంటల్లోనే మటుమాయమైపోయిన సందర్భాలు ఉన్నాయి. గత ఐదేళ్లలో అమిత్ షా ఆస్తులు 300శాతం పెరిగాయంటూ టైమ్స్ ఆఫ్ ఇండియా అహ్మదాబాద్ ఎడిషన్ లో రాసుకొచ్చింది. అయితే, ఈ వార్తను పబ్లిష్ చేసిన కొద్దిసేపటికే డిలీట్ చేసింది. ఇదేకాదు, కొన్ని నెలల క్రితం ఫసల్ బీమా యోజన పై మోదీ సర్కారును విమర్శిస్తూ టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రచురించిన వార్తను కొన్ని గంటలకే తన వెబ్ సైట్ నుంచి రిమూవ్ చేసింది. సదరు వార్తను చదువుదామని లింక్ క్లిక్ చేస్తే సారీ..  404 ఎర్రర్.. వంటివి కనిపిండంతో అవాక్కవడం పాఠకుల వంతవుతోంది.

టాప్‌లో అమిత్ షా ‘బ్యాంక్‌’

 

 

Related News