‘కాలా డైరెక్టర్‌తో రాహుల్ గాంధీ సినిమా’

సూపర్ స్టార్ రజనీకాంత్‌తో ‘కాలా’, ‘కబాలి’ సినిమాలు తెరకెక్కించిన యువదర్శకుడు పా రంజిత్, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిశారు. ఈ విషయాన్ని రాహుల్ స్వయంగా వెల్లడించారు. బ్లాక్ బస్టర్ మూవీస్ దర్శకుడు పా రంజిత్, యాక్టర్ కలైయారసన్‌తో ఢిల్లీలో భేటీ అయిన సంగతి చెబుతూ వాళ్లతో దిగిన ఫొటోలను రాహుల్ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా అనేక విషయాలు చర్చించామని తెలిపారు.

రాజకీయాలు, సినిమాలు, సొసైటీకి సంబంధించి అనేక విషయాలు మాట్లాడుకున్నామని, తమ సంభాషణ చాలా ఆనందభరితంగా సాగిందని.. భవిష్యత్‌లో కూడా ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నట్టు రాహుల్ చెప్పారు. పా రంజిత్ తన కాలా సినిమాలో సామాజిక అంశాలపై పలు డైలాగ్స్, సన్నివేశాలు జోడించి అందరి దృష్టిని ఆకర్షించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే, రాహుల్ ట్వీట్‌కు అతని అభిమానులు రకరకాలుగా స్పందిస్తున్నారు. పా రంజిత్‌తో సినిమా చేస్తారా అంటూ రాహుల్‌కు చిలిపి ప్రశ్నలు వేస్తున్నారు.

Related News