టీటీడీపీతో పొత్తుకు ఓకె..

తెలంగాణలో టీఆర్ఎస్‌ను  ఓడించేందుకు టీటీడీపీతో సహా ఇతర విపక్షాలతో పొత్తు కుదుర్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు  రాహుల్ గాంధీ..ఆమోదముద్ర వేశారు.  శుక్రవారం ఢిల్లీలో సుమారు 40 మంది టీ.కాంగ్రెస్ నేతలతో సమావేశమైన ఆయన.. పొత్తు ప్రతిపాదనకు అంగీకరించారని ఆ తరువాత టీపీసీసీచీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.  పార్టీ నేతల మధ్య అభిప్రాయ భేదాలను అంతర్గతంగా చర్చించుకోవాలని, పొత్తులపై బహిరంగ వ్యాఖ్యలు చేయరాదని సూచించారని ఆయన చెప్పారు. తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సారి గెలుపుగుర్రాలకే టికెట్లు ఇస్తామని రాహుల్ చెప్పారని ఉత్తమ్ వెల్లడించారు. కాగా-ఈ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక, ప్రచారం తదితర అంశాల పర్యవేక్షణకు ముగ్గురు సభ్యులతో తెలంగాణా కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీని రాహుల్ ఏర్పాటు చేశారు.  పార్టీ సీనియర్  నేత భక్త చరణ్ దాస్ నేతృత్వంలోని ఈ కమిటీలో జ్యోతిమణి సెంతిమలై, శర్మిష్ఠ ముఖర్జీ సభ్యులుగా వ్యవహరిస్తారు. అటు-తెలంగాణా నేతల సమావేశంలో రాహుల్ అందరి అభిప్రాయాలూ సేకరించారని సీనియర్ నాయకుడు కుంతియా తెలిపారు. పొత్తులపై టీడీపీ, సీపీఐ పార్టీలతో ఉత్తమ్ చర్చలు జరుపుతున్నారని, అయితే తుది నిర్ణయం అధిష్టానానిదేనని ఆయన చెప్పారు.

Related News