బాబుకు నోటీసుపై చిన్నమ్మ రియాక్షన్

ధర్మాబాద్ కోర్టు పంపిన నాన్ బెయిలబుల్ వారెంట్ పై తెలుగుదేశం నిప్పులు కక్కుతుందో.. బీజేపీ మాత్రం ఇది తమ పనికాదంటూ చేతులు దులుపుకుంటోంది. మోదీ ప్రాభవాన్ని తగ్గించడంలో చంద్రబాబు సక్సెస్ అవుతుండడం వల్లే బీజేపీ, కక్ష సాధింపు చర్యలకు దిగుతోందన్నది టీడీపీ వెర్షన్. బాబుకు అందిన నోటీసులతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదంటున్నారు ఆ పార్టీ నేత పురందేశ్వరి.

ఎనిమిదేళ్ల కిందట కేసుకి ఇప్పటి బీజేపీ ప్రభుత్వానికి ఎలా లంకె పెడతారన్నది ఆమె సూటి ప్రశ్న. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆమె, అవసరమనుకుంటే మహారాష్ర్ట ప్రభుత్వం దగ్గరే క్లారిటీ తీసుకోవాలి తప్ప ఏపీ బీజేపీని నిలదీస్తే ఊరుకునేది లేదన్నారు చిన్నమ్మ.

Related News