రాసలీలల రాజయ్య మాకొద్దు

జనగామ జిల్లాలోని స్టేషన్ ఘన పూర్ నియోజకవర్గంలో మహిళా సమాజాన్ని కించపరచేవిధంగా రాసలీలలకు పాల్పడుతున్న తాజా మాజీ ఎమ్మెల్యే టి.రాజయ్య తమకొద్దని అసమ్మతినేతలు డిమాండ్ చేస్తున్నారు. ఒక మహిళతో అసభ్యంగా ఆయన మాట్లాడిన ఆడియో టేపు సంభాషణ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన నేపథ్యంలో.. ఇలాంటి ప్రజాప్రతినిధి తమకు వద్దని, ఇక్కడ అభ్యర్థిని సీఎం కేసీఆర్ వెంటనే మార్చాలని స్టేషన్ ఘన పూర్, దేశాయితండా తెరాస నేతలు కోరుతున్నారు.

మంగళవారం సమావేశమైన వీరు.. ఈ నియోజకవర్గంలో రాజయ్య నిరంకుశత్వాన్ని ఇక భరించలేమన్నారు. ఎమ్మెల్యేగా, డిప్యూటీ సీఎంగా వ్యవహరించిన వ్యక్తి ఇంత దిగజారుడుగా మాట్లాడుతారని తాము ఊహించలేదని వారు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. ఈ ఆడియో టేపు వ్యవహారంపై ఫోన్ ద్వారా రాజయ్యను సంప్రదించగా.. తాను ఎవరితోనూ ఎలాంటి ఫోన్ సంభాషణా చేయలేదని, ఎన్నికల తరుణంలో తనంటే ఎవరో గిట్టనివారే ఇలాంటి చీప్ ట్రిక్స్ కి పాల్పడుతున్నారని అన్నారు. ఆ గొంతు తనది కాదన్నారు. మహిళలంటే తనకెంతో గౌరవమని అయన చెప్పుకొచ్చారు.

Related News