మళ్ళీ సొంత గూటికి.. అమెరికాలో అడుగుపెట్టిన జంట

ఇండియా, బ్రెజిల్ టూర్ తర్వాత ప్రియాంక చోప్రా, నిక్ జొనాస్ తిరిగి అమెరికా చేరుకున్నారు. న్యూయార్క్‌లో కాలు పెట్టారు. బ్రెజిల్‌లో నిక్ మ్యూజిక్ కన్సర్ట్‌ని ఎంజాయ్ చేసిన ప్రియాంక.. ఇక్కడా అతని ‘ కచేరీ ‘లకు హాజరయ్యేందుకు ఉవ్విళ్ళూరుతోంది.

My favourites @priyankachopra & Ahil ! Nyc diaries ❤️

A post shared by Arpita Khan Sharma (@arpitakhansharma) on

ప్రస్తుతానికి బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ మేనల్లుడు చిన్నారి అహిల్ శర్మతో ఆమె ఎంజాయ్ చేస్తోంది. అహిల్ తల్లి అర్పిత (సల్మాన్ సోదరి) ఈ ఫోటోను పోస్ట్ చేసింది. కోలా డ్రింక్‌తో అహిల్ నడుస్తున్న ఈ ఫోటోని ప్రియాంక ఫ్యాన్స్ కూడా షేర్ చేశారు. ఈ కుర్రాడంటే ప్రియాంకకు ఎంతో ఇష్టమట. తను ముంబై ఎప్పుడు వచ్చినా వాడితో సరదాగా గడుపుతుంది. మరి-ఈ చిన్నారి అమెరికాలో ఎన్ని రోజులు ఉంటాడో ?

Related News