‘లేడీ బాస్’ ప్రియాంక చోప్రా!

బాలీవుడ్ నుంచి హాలీవుడ్ దాకా గ్లామర్ ఇండస్ట్రీని తెగ ఊపేస్తున్న ప్రియాంక చోప్రా.. ఇప్పుడు కొత్త కొత్త కార్నర్స్‌ని తాకేస్తోంది. ఒకవైపు సినిమాలు చేస్తూనే, మరోవైపు తన పెళ్లి పనులతో బిజీగా ఉంటోంది. ఇప్పుడు వ్యాపారంపై కూడా దృష్టి పెట్టేసింది. బంబుల్ అనే ఒక డేటింగ్ యాప్‌తో పాటు మరో టెక్నో స్టార్టప్‌లో కూడా పెట్టుబడికి ప్రియాంకా చోప్రా ముందుకొచ్చింది. ఈ డీల్ ఓకే చేసుకోవడంలో నాలుగురోజులుగా పీసీ తలమునకలై వుంది. టెక్నో స్టార్టప్స్‌లో డబ్బులు పెట్టడమనేది సెలబ్రిటీలకు కొత్త కాదు. కాకపొతే.. ఇంతవరకూ స్పోర్ట్స్, సినిమా ఫీల్డ్స్‌లో మగవాళ్ళు మాత్రమే ఈ విషయంలో ముందుండేవారు. ఇప్పుడు ప్రియాంక ట్రెండ్ మార్చి ‘నేను సైతం’ అంటూ ఒక మెట్టు పైకెక్కేసింది. కట్ చేస్తే.. ఆదివారం ముంబై ఎయిర్‌పోర్ట్‌లో దిగిన పీసీ.. తన డ్రెస్‌కోడ్‌ని కూడా పూర్తిగా మార్చినట్లు కన్పించడంతో కెమెరాలు క్లిక్ మనిపించాయి. గాగుల్స్, గ్రే కలర్ క్యాజువల్ సూట్ తో ఒక ‘లేడీ బాస్’లా తళుక్కుమంది ప్రియాంక..!

Related News