అప్‌డేట్ ! బ్రెజిల్‌లో ఈ కపుల్ !

వావ్ ! ఆ జంట శుక్రవారం ఉదయం ముంబై విమానాశ్రయంలో చేతిలో చెయ్యేసుకుని నడుస్తూ వెళ్తుంటే అమెరికాకో, దుబాయ్‌కో చెక్కేస్తున్నారని వార్తలు వచ్చాయి. అయితే అంతా తప్పులో కాలేశారు. ఆ దేశాలేవీ కాదని, ఇద్దరూ బ్రెజిల్ బాట పట్టారన్నది తాజా న్యూస్.. ఇంతకీ ఆ జంట ఎవరంటే..ఇంకెవరు ? ప్రియాంక చోప్రా, ఆమె బాయ్‌ఫ్రెండ్ నిక్ జొనాసే ! వీళ్ళు డేటింగ్ చేస్తున్నారో ఏమో తెలియదు గానీ ఇద్దరూ ఇంటర్నెట్‌ను మాత్రం షేక్ చేసేస్తున్నారు. తాజాగా బ్రెజిల్‌లో నిక్ మ్యూజిక్ కాన్సర్ట్ చేస్తుంటే ఆ ‘ వేడుకను’ ప్రియాంక మురిపెంగా చూస్తూ …తన ఇన్‌స్టా‌గ్రా‌మ్‌లో ఫోటోను పోస్ట్ చేసింది. మూడే మూడు అక్షరాలతో him అంటూ తన ప్రేమ (?) ను చాటుకుంది. నిక్ కూడా స్టేజీ మీది తన పర్ఫార్మెన్స్‌ని హైలైట్ చేస్తూ తనూ తీసిపోలేదన్నట్టు ఫోటో షేర్ చేశాడు. మొత్తానికి ఈ అమ్మడు రెండు అప్‌డేట్స్‌ని విడుదల చేయడం విశేషం.

Related News