రాహుల్ సైగలకు ప్రియ వారియర్ ఫుల్‌ఖుషీ

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ లోక్‌సభలో చేసిన కనుసైగలపై స్పందించింది హీరోయిన్ ప్రియా‌ప్రకాష్ వారియర్. తన లైఫ్‌లో మరిచిపోలేని రోజు ఇదేనని గుర్తు చేసింది. ఇప్పుడు చాలా ఆనందంగా వుందని, అంతపెద్ద వ్యక్తితో తనను పోల్చినందుకు సంతోషిస్తున్నా. కొన్నినెలల తర్వాత నా పేరు ఇంటర్నెట్‌లో మళ్లీ సంచలనం అవుతోందని తెలిపింది.

తాను కాలేజ్ నుంచి ఇంటికి తిరిగి రాగానే మా అమ్మ ఈ విషయం చెప్పింది. వెంటనే టీవీ చూశాను. ప్రధాని నరేంద్రమోదీ సర్‌ ఉండగా పార్లమెంట్‌లో రాహుల్‌ సర్‌ కన్నుకొట్టారని వస్తోంది. సోషల్‌‌మీడియాలో రాహుల్‌ సర్‌ను- తనను పోల్చి చూపిస్తున్నారని చెప్పుకొచ్చింది. మలయాళ చిత్రం ‘ఒరు అదార్‌ లవ్’లోని ‘మాణిక్య మలరాయ’ పాటకుగాను ప్రియ కనుసైగలు కొన్నినెలల కిందట ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టించిన విషయం తెల్సిందే!

పార్లమెంట్‌ అవిశ్వాస తీర్మాన చర్చ సందర్భంగా రాహుల్‌ ప్రసంగం ముగిశాక ఆయన ప్రధాని మోదీని ఆలింగనం చేసుకున్న విషయం తెలిసిందే. అనంతరం రాహుల్‌ తన స్థానంలో కూర్చున్న తర్వాత తోటి నేతల వైపుగా తిరిగి కన్నుగీటారు. ఇది కాస్తా సోషల్‌మీడియాలో వైరల్‌ అయింది. దీనిపై ఇంటర్నెట్‌ కామెంట్స్ పడిపోతున్నాయి. ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ను మర్చిపోయేలా రాహుల్‌ కన్ను కొట్టారంటూ కామెంట్స్ పడిపోతున్నాయి.

Related News