రాహుల్‌పై సభా హక్కుల ఉల్లంఘన !

లోక్‌సభలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రవర్తనను బీజేపీ తీవ్రంగా పరిగణించింది. ఆయనకు సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇవ్వాలనే విషయమై బీజేపీ పార్లమెంటరీ పార్టీ యోచిస్తోంది.

ప్రధాని మోదీని రాహుల్ కౌగలించుకోవడం సభా మర్యాదలకు విరుద్ధమని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంత కుమార్ అన్నారు. ఇది పిల్ల చేష్ట..సభా గౌరవాన్ని మంట గలిపేదిగా ఉందన్నారు. రాహుల్ కన్ను కొట్టడాన్ని కూడా ఆయన తప్పు పట్టారు. ఒక ప్రధాన ప్రతిపక్ష నేత ఇలా వ్యవహరించడం సముచితం కాదన్నారు.

READ ALSO

Related News