ప్రణయ్ హత్య కేసు: కీలక నిందితుడు శర్మ అరెస్ట్

మిర్యాలగూడలో సంచలనం రేపిన ప్రణయ్ హత్య కేసు మిస్టరీ దాదాపు వీడినట్టే! ఈ కేసులో కిరాయి హంతకుడు శర్మ ప్రధాన నిందితుడని తేలింది. బీహారీవాసి అయిన శర్మను తెలంగాణ పోలీసులు సమస్తీపూర్ కోర్టులో హాజరుపరిచి ఆ తర్వాత నల్గొండకు తరలించనున్నారు.

ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు ఐదుగురికిపైగా నిందితులను అరెస్ట్ చేశారు. శర్మని మంగళవారం సాయంత్రం మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు. ప్రణయ్ హత్యకు మాజీ ఉగ్రవాది మహ్మమద్ అబ్దుల్ బారీతో కోటి రూపాయలకు మారుతీరావు ఒప్పందం కుదుర్చుకున్నాడని వార్తలొచ్చిన సంగతి తెల్సిందే! బారీ తన గురువు అస్గర్ అలీతో ప్లాన్ చేసి బీహార్‌లోని సంస్తాన్‌పూర్ జిల్లాకి చెందిన శర్మను ఈ ఆపరేషన్ కు వినియోగించుకున్నాడని తెలుస్తోంది. ఈ కేసులో శర్మని విచారిస్తే ఇంకెన్ని విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.

Related News