ఫ్యాన్స్‌కి డబుల్ ఢమాకా

ప్రభాస్ గురించి లేటెస్ట్ న్యూస్. ప్రస్తుతం సాహో‌తోపాటు మరో ప్రాజెక్టుతో బిజీగా వున్నాడు ఈ హీరో. బాహుబ‌లి తర్వాత ప్రభాస్ చేస్తున్న సినిమాలు కావడంతో అందరిలోనూ అంచనాలు పెరిగాయి. ఐతే, అక్టోబర్ 23న రెబల్‌స్టార్ ప్రభాస్ బ‌ర్త్‌డే కావడంతో అభిమానులు కొండంత ఆశతో వున్నారు. పుట్టినరోజుకి ఒకరోజు ముందే అంటే 22న సాహో టీజ‌ర్‌తోపాటు రాధాకృష్ణ ఫిల్మ్ ఫ‌స్ట్‌లుక్‌, టైటిల్ రివీల్ చేయ‌నున్నట్టు అంతర్గత సమాచారం. ఒకే రోజు అభిమానులకి డ‌బుల్ ట్రీట్ అన్నమాట.

 

సాహో చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. సుజీత్ డైరెక్ట్ చేస్తున్న ఈ ప్రాజెక్టులో హాలీవుడ్ తరహా యాక్షన్ ఎపిసోడ్స్‌ వుండనున్నాయి. ఇక ప్రభాస్- రాధాకృష్ణ కాంబో ఫిల్మ్ రీసెంట్‌గా సెట్స్‌పైకి వెళ్లింది. ప్రజెంట్ షూటింగ్ యూర‌ప్‌లో జ‌రుగుతోంది. దీనికి ‘అమూర్’ లేదా ‘జాన్’ అనే టైటిల్‌ని ప‌రిశీలిస్తున్నట్టు సమాచారం.

Related News