జేడీ-యూలో చేరిన పీకే

రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే) రాజకీయ ఆరంగేట్రం చేశారు. ఆదివారం ఆయన బీహార్ సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీ-యూలో చేరారు. పాట్నాలో జరిగిన రాష్ట్ర పార్టీ కార్యవర్గ సమావేశంలో ఈ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.’ బీహార్ నుంచి కొత్త ప్రయాణాన్ని ప్రారంభించడం ఉత్తేజభరితంగా ఉంది ‘ అని ఆయన శనివారంనాడే ట్వీట్ చేశారు.
పీకే చేరికపై స్పందించిన నితీష్ కుమార్.. భవిష్యత్తు ఇక ఈయనదే అని వ్యాఖ్యానించారు. 2012 లో గుజరాత్ ఎన్నికల్లో, 2014 లో సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ తరఫున పని చేసిన ప్రశాంత్ కిషోర్.. అమిత్ షాతో తలెత్తిన విభేదాలతో ఆ పార్టీకి దూరమయ్యారు. అనంతరం 2015 లో జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి (జేడీ-యూ, ఆర్జేడీ, కాంగ్రెస్) విజయంకోసం కృషి చేశారు. ప్రస్తుతం వైసీపీ ప్రచార కర్తగా ఉన్న ఆయన..వచ్చే లోక్ సభ ఎన్నికల్లో 40 సీట్లను దక్కించుకోవాలన్న లక్ష్యంతో ఉన్నారు.

Related News