బాబు డైరెక్షన్లో అట్టహాసంగా పోలవరం ‘గ్యాలరీ వాక్’

పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే గ్యాలరీ పనులు కొలిక్కి రావడంతో ఏపీ సీఎం చంద్రబాబు బుధవారం ‘గ్యాలరీ వాక్’ పేరుతో కొత్త కార్యక్రమం చేపట్టారు.  స్పెషల్ బస్సుల్లో కుటుంబ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో ఆర్భాటంగా పోలవరం గ్యాలరీ టూర్‌కి శ్రీకారం చుట్టారు.

వరద నీటిని దిగువకు విడుదల చేయడానికి వీలుగా నిర్మించే స్పిల్ వే భద్రత కోసం దానికి దిగువన గ్యాలరీ నిర్మిస్తారు. రిజర్వాయర్‌లో నిల్వ ఉండే నీటి ఒత్తిడి స్పిల్ వే మీద పడకుండా చూడడమే దీని ఉద్దేశం.

నీటి నిల్వ వల్ల స్పిల్ వే కాంక్రీట్ నిర్మాణానికి చెమ్మ తగులుతుంది. ఫలితంగా లీకయ్యే నీటిని ఎప్పటికప్పుడు బయటకు తోడేయడానికి దీనివల్ల వీలవుతుంది.

ఏమైనా..కుటుంబ సభ్యులతో కలిసి గ్యాలరీ వాక్‌లో పాల్గొంటున్న చంద్రబాబు.’ఏదో వేడుక ‘ లా అందర్నీ ఆహ్వానిస్తూ భారీ ఎత్తున పత్రికలు ముద్రించి పంపిణీ చేయడం విశేషం. కాగా దెందులూరు సమీపంలో ఓ బస్సు మట్టిలో దిగబడిపోగా ఈ ‘యాత్ర’కు కొద్దిసేపు అంతరాయం కలిగింది. ప్రజా ప్రతినిధులు వేరే వాహనాల్లో బయలుదేరి వెళ్ళారు. వీరికోసం మొత్తం 8 బస్సులను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

అటు గ్యాలరీ వాక్‌ను ప్రారంభించిన అనంతరం 48వ బ్లాక్‌లోకి చంద్రబాబు ప్రవేశించి 36వ బ్లాక్ వరకు నడిచారు.  గ్యాలరీ మొత్తం నడిచా..ఇది ఎంతో అనుభూతినిచ్చింది అని బాబు ఆ తరువాత అన్నారు.

READ ALSO

Related News