ప్రధాని ఇమ్రాన్‌కు పీఎం మోదీ రాసిన లేఖలో

పాకిస్థాన్‌ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఇమ్రాన్‌ఖాన్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ భారత ప్రధాని నరేంద్రమోదీ ఓ లేఖ రాశారని అధికారులు వెల్లడించారు. అందులో ఇరుదేశాల మధ్య సత్సంబంధాలు నెలకొనాలని ఆశాభావం వ్యక్తంచేశారు. పొరుగు దేశాలతో తాము మంచి సంబంధాలను కోరుకుంటామని, నిర్మాణాత్మకమైన, అర్థవంతమైన ఒప్పందాల దిశగా ముందు కెళ్లాలని మోదీ లేఖలో పేర్కొన్నారు. పాక్ సాధారణ ఎన్నికల్లో ఇమ్రాన్‌ఖాన్‌ విజయం సాధించిన అనంతరం మోదీ ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపిన సమయంలో ఆయనతో చెప్పిన విషయాలనూ ఈ లేఖలో పొందుపరిచారు.

Related News