నేతలకు షాక్‌లు.. మోదీ తర్వాత శశిథరూర్

ఎన్నికలు సమీపిస్తున్న వేళ నేతలకు ఊహించని షాక్‌. ట్విట్టర్‌లోవున్న ఫేక్ ఖాతాల తొలగింపు ప్రక్రియ శుక్రవారం నుంచి మొదలుపెట్టింది ఆ సంస్థ. అరచేతిలోకి సెల్‌ఫోన్ వచ్చాక సోషల్‌మీడియా పరిధి పెరిగింది. ఫేస్‌బుక్, ట్విట్టర్ల ద్వారా నేతలు, సెలబ్రిటీలను ఫాలో అయ్యేవారి సంఖ్య ఇటీవలికాలంలో పెరిగింది. ఈ క్రమంలో నకిలీ ఖాతాలు కోట్లలో పుట్టుకొచ్చాయి. వీటివల్ల ఇబ్బందులు తలెత్తడంతో ఫేక్ ఖాతాల ఏరివేత కార్యక్రమాన్ని మొదలుపెట్టింది ట్విట్టర్. ఈ చర్య ఖాతాదారుల్లో విశ్వాసం పెంచేందుకు దోహదపడుతుందని ఆ సంస్థ తెలిపింది.

ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం.. ప్రధాని మోదీ ఫాలోవర్స్‌ 43.4 మిలియన్ల నుంచి 43.1 మిలియన్‌కు దిగజారింది. శుక్రవారం ఒక్కరోజే దాదాపు 3 లక్షల ఫాలోవర్స్ తగ్గిపోయారు. మోదీ తర్వాత కాంగ్రెస్ నేత శశిథరూర్‌‌కు బాగా డ్యామేజ్ అయినట్టు తెలుస్తోంది.ఆయన ఖాతా నుంచి లక్షా 51వేల మంది తగ్గిపోయారు. సుష్మాస్వరాజ్, కేజ్రీవాల్, అరుణ్ జైట్లీ, అమిత్ షా, రాహుల్‌గాంధీ వంటివాళ్లకు ఫాలోవర్స్ భారీగానే తగ్గినట్టు ఓ ఇంగ్లీస్ డైలీ రాసుకొచ్చింది.

 

ఇక అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు 53.4 కోట్ల మంది ఫాలోవర్స్‌లో లక్ష వరకు నకిలీ ఖాతాలున్నాయని తేలింది. మాజీ అధ్యక్షుడు ఒబామా 10.4 కోట్ల మంది ఫాలోవర్స్ వుండగా, నాలుగు లక్షల వరకు వేటు పడింది. మరోవైపు నటులు తమ ఫాలోవర్స్‌ని భారీగా కోల్పోతున్నారు.

Related News