ఏదైనా, మేము రెడీ -మోదీ

వర్షాకాల సమావేశాలు సజావుగా సాగుతాయని, అన్ని అంశాలపైనా చర్చలు జరిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా వుందన్నారు ప్రధాని మోదీ. పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు బుధవారం నుంచి ఆగస్టు 10 వరకు జరగనున్నాయి. ఈ సమావేశాలకు హాజరయ్యేందుకు పార్లమెంట్‌కు వచ్చిన ప్రధాని నరేంద్రమోదీ.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.

విపక్షాలు సభలో లేవనెత్తిన ఏ అంశంపైనైనా చర్చించేందుకు ప్రభుత్వం రెడీగా వుందన్నారు. బిల్లులపై చర్చలకు అన్ని పార్టీల సహకారం అవసరమని చెబుతూనే, సభా సమయాన్ని వృథా చేయవద్దని చెప్పుకొచ్చారు.

READ ALSO

Related News