పీఎం మోదీ పిలుపు, కేవలం 4 శాతమేనట

వంటగ్యాస్‌పై కేంద్రం ఇస్తున్న సబ్సిడీని స్వచ్ఛందంగా వదులుకోవాలని ప్రధాని మోదీ మూడేళ్ల కిందట పిలుపునిచ్చారు. ఆయన పిలుపుకు స్పందించి.. మాకొద్దు సబ్సిడీ అని త్యాగం చేసింది కేవలం 4 శాతం మాత్రమే! ఆర్థికంగా మెరుగైన స్థితిలోవున్న వాళ్లు వంటగ్యాస్‌పై సబ్సిడీని స్వచ్చందంగా వదులుకున్నారు. దీనికి ఈశాన్య రాష్ర్టాల నుంచి మాంచి స్పందన వచ్చింది. మిజోరాం-14 శాతం, నాగాలాండ్- 12 శాతం, మణిపూర్- 10 శాతం మంది సబ్సిడీ వదులుకున్నారు.

ఢిల్లీలో తప్పితే మిగతా రాష్ర్టాల్లో కేవలం సింగల్ డిజిట్ మాత్రమే వచ్చింది. ఢిల్లీ-12 శాతం, మహారాష్ట్ర- 6 శాతం, కర్ణాటక, హర్యానా, రాజస్థాన్, ఉత్తరాఖండ్, పంజాబ్ రాష్ట్రాల్లో 5 శాతం మంది యూపీ, మధ్యప్రదేశ్ లో 4 శాతం, బీహార్, ఛత్తీస్‌గఢ్, తమిళనాడు- 3 శాతం, పశ్చిమబెంగాల్-2 శాతం, ఏపీలో ఒక్కశాతం మాత్రమే సబ్సిడీని వదులుకున్నారు. గుజరాత్ – 4 శాతం మందే ముందుకు వచ్చారు. మొత్తమీద ఓవరాల్‌గా చూస్తే 2016 నాటికి కోటి మంది సబ్సిడీని విడిచి పెట్టారు.

Related News