మాకు తక్షణ సాయం అవసరం..మోదీకి చెప్పండి

భారీవర్షాలు, వరదలు కేరళను ఇంకా పట్టి పీడిస్తున్నాయి. తిరువనంతపురానికి సుమారు 120 కి.మీ. దూరంలోని చెంగన్నూరులో పరిస్థితి దారుణంగా ఉంది. అక్కడి లెజిస్లేటర్ సాజీ చెరియన్ అయితే టీవీ కెమెరాల ముందే కన్నీటి పర్యంతమయ్యారు. దయచేసి ప్రధాని మోదీకి చెప్పండి. ఇక్కడ చిక్కుకుపోయి ఉన్నవారిని కాపాడేందుకు  మరిన్ని హెలికాప్టర్లు కావాలి. వాటిని పంపమని చెప్పండి.. నా కళ్ళ ముందే సుమారు 50 మంది నీటిలో కొట్టుకుపోయారు.

ఇంకా ఎందరో గల్లంతయ్యారు. పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. హెలికాప్టర్ల ద్వారానే కనీసం మరికొంతమందిని కాపాడగలుగుతాం  అని ఆయన అన్నారు. పేద మత్స్య కారులనుంచి బోట్లు తెప్పిస్తున్నా..అవి కూడా మునిగిపోతున్నాయని  సాజీ చెరియన్ తెలిపారు. కాగా ఈ రాష్ట్రంలో అనేక రిజర్వాయర్లు నీటితో నిండిపోయి నీరు అనేక గ్రామాలను ముంచెత్తుతోంది.14 జిల్లాలు వరద ముప్పును ఇంకా ఎదుర్కొంటున్నాయి. ప్రధాని మోదీ ప్రకటించిన తక్షణ సాయం ఏ మూలకూ సరిపోదన్న విమర్శలు వినవస్తున్నాయి.

Related News