ఏపీలో పెట్రోలు ధర తగ్గింది

విపరీతంగా పెరిగిన పెట్రోలు, డీజిల్ ధరలపై పన్ను తగ్గించాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. పెట్రో ఉత్పత్తులపై రాష్ట్ర ప్రభుత్వం విధిస్తున్న పన్నులో లీటరుకు 2 రూపాయలు తగ్గిస్తున్నట్టు ఆయన సోమవారం అసెంబ్లీలో ప్రకటించారు. దీనివల్ల వాహనాదరులకు కొంతవరకైనా ఊరట కలుగుతుందన్నారు. అటు-రాజస్థాన్‌లో వసుంధరా రాజే ప్రభుత్వం కూడా నిన్ననే ఇలాంటి  నిర్ణయాన్ని ప్రకటించింది. పెట్రో ఉత్పత్తుల ధరల పెరుగుదలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ సోమవారం భారత్ బంద్ కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.

Related News