‘ఆర్‌ఎక్స్’కి అలాసరిపెట్టారా?

‘ఆర్‌ఎక్స్ 100’ మూవీతో టాలీవుడ్‌లో పాపులర్ అయ్యింది హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్. ఈ ఫిల్మ్ హిట్ కావడంతో ఆమె నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటి? ఎవరితో సెట్స్‌పైకి వెళ్లనుంది అనేది ప్రస్తుత ప్రశ్న. ఫస్ట్ సినిమాలో ఓ రేంజ్‌లో అందాలు ఆరబోసిన ఈ బ్యూటీ, కాస్తా వల్గర్‌గా నటించిందనే టాక్ ప్రేక్షకుల్లో వుంది. రొమాంటిక్ సీన్స్‌ కోసం ఆమె భారీగానే రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందనే టాక్ నడిచింది. ఇంతకీ ‘ఆర్‌ఎక్స్’లో నటించినందుకు పాయల్‌ అందుకున్న రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

కేవలం ఆరులక్షలు మాత్రమేనట. టాలీవుడ్‌‌‌లో ఫోకస్ అయితే ఆఫర్స్ వచ్చిపడతాయని చెప్పి ఆమెని కన్విన్స్ చేశారట. దీంతో ఆమె గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో సినిమా సెట్స్‌పైకి వెళ్లిందని అంటున్నారు. అన్నట్లు తెలుగు రాష్ర్టాల థియేటర్ రైట్స్‌ని 2.70 కోట్లకు అమ్మేశారట మేకర్స్. బాగుందని టాక్ రావడంతో.. ఇప్పుడు బయ్యర్లకు లాభాలపంట పండింది. ఇకపై చేయనున్న సినిమాలకు భారీగానే రెమ్యునరేషన్ అందుకోవాలని ఆలోచన చేస్తోందట పాయల్. ఇదిలావుండగా ఓపెనింగ్ రోజు రూ.1.42 కోట్ల కలెక్షన్లను సాధించిన ఈ చిత్రం, రెండోరోజు కూడా అదే స్పీడ్ కొనసాగించింది. మొత్తం రెండురోజుల్లో రూ.2.5 కోట్ల రావడంతో యూనిట్ ఫుల్‌ఖుషీ. ఈ వారం కూడా ఇదే స్పీడ్ కంటిన్యూ అయితే దాదాపు రూ.6 కోట్ల వరకు వసూళ్లు సాధించవచ్చని బయ్యర్ల అంచనా!

Related News