టీడీపీకి మెమొరీ లాస్‌‌- పవన్

‘గజినీ’ మూవీలో హీరో మాదిరిగా టీడీపీ ఇప్పుడు కన్వీనియెంట్ మెమొరీ లాస్ సిండ్రోమ్‌తో బాధపడుతోందని ఎద్దేవా చేశాడు జనసేన అధినేత పవన్‌కల్యాణ్. ఏపీ అంటే కేవలం 25 మంది ఎంపీలు, 175 మంది ఎమ్మెల్యేలు మాత్రమే కాదని, ఐదు కోట్ల మంది ప్రజలకు జవాబుదారీగా ఉండాలన్నారు. ఈ మేరకు  ట్విట్టర్‌లో రాసుకొచ్చాడు పవన్.

హోదాని నీరుగార్చింది ఎవరు? బీజేపీతో చేతులు కలిపింది ఎవరు? అంటూ ప్రశ్నించారు. ఏపీ సీఎం మాకు ఇంకా మంచి మిత్రుడేనని రాజ్‌నాథ్ సింగ్ అంటున్నారు. దీన్నిబట్టి టీడీపీ-బీజేపీ ఇంకా కలిసి ఉన్నాయని అర్థమవుతోందన్నారు. బీజేపీకి నష్టం కలగకూడదని జనసేన ట్వీట్స్ చేస్తోందన్న సీఎం బాబు వ్యాఖ్యలపైనా మండిపడ్డాడు పవన్.

ఏపీలో ఒక్క సీటు కూడా గెలవలేని బీజేపీని వెనకేసుకు రావడం వల్ల మాకు వచ్చే లాభమేంటి? అక్కడి ప్రజలు బీజేపీని పూర్తిగా వదిలేశారు.. ఆ పార్టీతో ఎవరైనా పొత్తు పెట్టుకుంటారా? బీజేపీతో సమానంగా టీడీపీ కూడా అంతే దారుణంగా ఏపీ ప్రయోజనాలను దెబ్బ తీసిందన్నదే ట్వీట్ల వెనుక ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశాడు పవన్.

READ ALSO

Related News