నేనూ రంగంలో దిగినట్టే

తెలంగాణా అసెంబ్లీకి జరగనున్న ముందస్తు ఎన్నికల నేపథ్యంలో జనసేనాని పవన్ కళ్యాణ్.తమ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (ప్యాక్) తో సుదీర్ఘంగా చర్చించారు. హైదరాబాద్ మాదాపూర్ లోని పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ఈ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఆయన చర్చించినట్టు జనసేన ఉపాధ్యక్షుడు బి.మహేందర్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.

సీపీఎం తెలంగాణా శాఖ నేతలు, ఆ పార్టీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నేతృత్వంలో జరిపిన చర్చల వివరాలను పవన్ కళ్యాణ్ కు ప్యాక్ సభ్యులు వివరించారు. ఆ చర్చలు ఫలవంతంగా జరగడంతో తదుపరి చర్చలు పవన్ సమక్షంలో జరగాలని వారు కోరారని, ఇందుకు ఆయన అంగీకరించారని తెలిపారు. మంగళ లేదా బుధవారం సీపీఎం నేతలతో సమావేశం జరగవచ్చునని ఆయన పేర్కొన్నారు.

Related News