నేను తప్పు చేసినట్టే: పవన్

ఈ స్థాయిలో ఉండి సమాజంలో జరుగుతున్న తప్పుల్ని ప్రశ్నించలేకపోతే, తాను తప్పుచేసినవాడ్నవుతానని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. అందుకే తాను రాజకీయాల్లోకి వచ్చానని, ఎంతకుదిరితే అంత సమాజానికి చేయాలన్నదే తన అభిమతమని, అంతేకాని పదవులు కాదని పవన్ అన్నారు. యువత తన ఓటు హక్కును పొందాలని దానిని సక్రమంగా వినియోగించుకున్నప్పుడే సమాజం బాగుపడుతుందని పవన్ చెప్పుకొచ్చారు. అనంతరం పవన్‌ కళ్యాణ్‌కు చిన్నప్పుడు చదువు నేర్పిన గురువులను సన్మానించారు. గురువులు దేవుళ్లతో సమానమని పవన్ చెప్పుకొచ్చారు.

Related News