పవన్ కళ్యాణ్‌కు కంటి ఆపరేషన్

సినీ నటుడు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు హైదరాబాద్ లోని ఎల్వీ ప్రసాద్‌ కంటి ఆస్పత్రిలో శస్త్రచికిత్స చేశారు. దాదాపు రెండు నెలలుగా పవన్ కంటి సమస్యతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. దీంతో ఆయన పది రోజుల క్రితం ఎల్వీ ప్రసాద్‌ ఆస్పత్రి వైద్యులను పవన్‌ సంప్రదించారు.

ఎడమ కంటిలో కురుపు అయిందని దానికి శస్త్ర చికిత్స చేయడమే మార్గమని వైద్యులు సూచించడంతో ఆయన ఆపరేషన్ కు రెడీ అయ్యారు. ఈ మేరకు బుధవారం పవన్‌ ఆసుపత్రిలో చేరగా విజయవంతంగా వైద్యులు శస్త్రచికిత్స పూర్తి చేశారు.

Related News