భూములు లాక్కుంటే ఖబడ్దార్ ! పవన్ ఫైర్

బలవంతంగా రైతుల భూములు లాక్కుంటే సహించేది లేదని హెచ్చరించాడు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. ప్రభుత్వ బెదిరింపులకు ఎవరూ భయపడవద్దని, ప్రభుత్వం మరో బషీర్‌బాగ్ ఉదంతం చేయాలనుకుంటే పోలీసుల తూటాకు ముందు నా గుండె చూపుతానని అన్నాడు.

ఆదివారం అమరావతిలోని ఉండవల్లి రైతులతో భేటీ అయిన ఆయన.. రైతులు స్వచ్చందంగా ఇస్తేనే సర్కార్ భూసేకరణకు పూనుకోవాలని పేర్కొన్నాడు.

వైజాగ్ స్టీల్‌ప్లాంటుకు భూములు ఇచ్చిన వ్యవసాయదారులు తమ నష్ట పరిహారంకోసం ఇంకా ఎదురుచూస్తున్నారని పవన్ తెలిపాడు. అవసరానికి మించి వీటిని సేకరించకండి. అసైన్డ్ భూములకు భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలిందే అని ఆయన డిమాండ్ చేశాడు.

120 రకాల పంటలు పండే భూములను లాక్కోవడం అన్యాయం అని పవన్ కళ్యాణ్ అన్నాడు. కాగా..పలువురు రైతులు తమ ఆవేదనను ఆయన దృష్టికి తెచ్చారు. వీరి ఆవేదనతో కూడిన రాజధాని వద్దని, రైతులను ఏడిపిస్తే నాశనమవుతారని పవన్ ఆవేశంగా వ్యాఖ్యానించాడు.

Related News