క్యాబ్‌లో హీరోయిన్‌కి ఏం జరిగింది?

హీరోయిన్‌ పరుల్‌‌యాదవ్‌కు క్యాబ్‌లో ఊహించని చేదు అనుభవం ఎదురైంది. ట్రావెల్ సమయంలో ఆమె విలువైన వస్తువులను దొంగతనం చేశాడు క్యాబ్ డ్రైవర్. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం బయటపడింది. కన్నడ బ్యూటీ పరుల్‌‌యాదవ్‌ ఇటీవల ఓ మ్యారేజ్ వార్షికోత్సవానికి వెళ్లేందుకు ఓలా క్యాబ్‌‌ని బుక్‌ చేసుకుంది. ఆ దంపతుల కోసం విలువైన వాచీల సెట్‌ని వెంట తీసుకెళ్లింది. మార్గమధ్యలో ఆపి పని మీద కిందికి దిగింది ఆమె. తిరిగి క్యాబ్‌ ఎక్కేసరికి వస్తువులు కనిపించకుండా పోయాయి.

ఈ విషయమై డ్రైవర్‌ని ఆరా తీయగా, తనకు తెలీదంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీనిపై ఓలా సపోర్ట్ కాల్‌ సెంటర్‌కు ఫోన్ చేసినప్పటికీ ఫలితం లేదు. పరుల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన బెంగుళూరు పోలీసులు, ఎట్టకేలకు పోయిన వస్తువులను ఆమెకి అందజేశారు. పోలీసులకు కృతజ్ఞతలు చెబుతూ తన ట్విటర్‌లో ఈ విషయాన్ని రివీల్ చేసింది. వ్యక్తుల గురించి ఎలాంటి నిర్ధారణ లేకుండా డ్రైవర్లుగా ఎలా నియమించుకుంటా రని క్యాబ్‌ సర్వీస్‌ని నిలదీసింది.

 

READ ALSO

Related News