టాలీవుడ్‌లో మరో లవ్‌స్టోరీ ఫిల్మ్.. ట్రైలర్

టాలీవుడ్‌లో రిలీజ్‌కి రెడీ అవుతున్న లవ్‌స్టోరీ ఫిల్మ్ ‘పరిచయం’. దీనికి సంబంధించిన ట్రైలర్‌ సోమవారం విడుదలైంది. విరాట్ – సిమ్రత్ కౌర్ హీరో హీరోయిన్లుగా తెలుగు తెరకు పరిచయం అవుతున్న ఈ ఫిల్మ్.. లవ్‌, ఫ్యామిలీ ఎంటర్‌ టైనర్‌గా రానుంది. మరి విరాట్ – సిమ్రత్ లవ్‌స్టోరీకి ఇరు కుటుంబాల పెద్దలేమన్నారు? వీళ్ల కారణంగా ఇరు ఫ్యామిలీల మధ్య ఎలాంటి విభేదాలొచ్చాయి? చివరకు వీళ్ల లవ్‌కి ఎలాంటి శుభం కార్డ్ పడిందనేది కథనం. సీనియర్ నటీనటులు ఇందులో కీలకపాత్రలు పోషిస్తున్నారు. అసిన్ మూవీ క్రియేషన్స్ పతాకం‌పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి లక్ష్మీకాంత్ చెన్నా డైరెక్టర్.

 

Related News