‘పేపర్ బాయ్’ ట్రైలర్.. ప్రేమంటే కనిపించదు, కానీ..

డైరెక్టర్ సంపత్‌నంది.. సొంత బ్యానర్‌లో తెరకెక్కిస్తున్నమూవీ ‘పేపర్ బాయ్’. దీనికి సంబందించి అన్నిపనులు పూర్తి కావడంతో రెండు నిమిషాల ట్రైలర్‌ని యూనిట్ విడుదల చేసింది. ఓ అమ్మాయి- ఓ పేపర్‌ బాయ్‌ మధ్య జరిగే లవ్ స్టోరీయే ఈ ఫిల్మ్ మెయిన్ థీమ్. ‘ఈ రోజుల్లో అబ్బాయిలకు బుక్ రీడింగ్ కూడా వుందా’ అంటూ హీరోయిన్ మాటలు, ‘ప్రేమంటే ఆక్సిజన్ లాంటిది, అది కనిపించదు.. కానీ, బతికిస్తుంది’, ముద్దు పెట్టుకోవడమంటే పెదాలు మార్చుకోవడం కాదు, ఊపిరి మార్చుకోవడం అంటూ హీరో చెప్పిన డైలాగ్స్ బాగున్నాయని అంటున్నారు సినీ లవర్స్. సంతోష్‌ శోభన్‌- రియా- తాన్య హోప్‌ కాంబోలో రానున్న ఈ చిత్రానికి డైరెక్టర్ జయశంకర్‌. ‘గోల్కొండ హైస్కూల్’లో బాల నటుడిగా కనిపించిన సంతోష్‌ శోభన్‌, ఇందులో హీరోగా కనిపించనున్నాడు.

 

Related News