అది బతకడం కోసం.. ఇది భవిష్యత్ కోసం..

దర్శకుడిగా తనకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న సంపత్‌ నంది, ఇప్పుడు ప్రొడ్యూసర్‌గా మారి ‘పేపర్‌బాయ్’ మూవీని నిర్మిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించి ఓ నిమిషం నిడివిగల టీజర్ రిలీజైంది. ‘బీటెక్ చేసి న్యూస్‌పేప‌ర్స్ వేస్తున్నావా’ అని హీరోని హీరోయిన్‌ ప్రశ్నించ‌గా.. ‘అది బ‌త‌క‌డం కోసం, ఇది భ‌విష్యత్ కోసం’ అని చెప్పే డైలాగ్ బాగుంది. సంతోష్‌శోభ‌న్- రియాసుమ‌న్‌- తాన్యాహోపేల కాంబోలో రానున్న ఈ చిత్రానికి సంప‌త్‌నంది  స్టోరీ అందించాడు. భీమ్స్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. ఈ ఫిల్మ్ ద్వారా జ‌య‌శంక‌ర్ ద‌ర్శకుడిగా టాలీవుడ్‌కి  ప‌రిచ‌యం కానున్నాడు.

 

Related News