ఉత్తమ్ వెనుక ఉన్నది ఆ మ‌హిళే…

ప్రతి మ‌గాడి విజ‌యం వెనుక ఒక ఆడ‌ది ఉంటుందన్న నానుడిని నిజం చేసే ప్రయ‌త్నంలో ఉన్నారు ఉత్తమ్ స‌తీమ‌ణి ప‌ద్మారెడ్డి. తాజా మాజీ ఎమ్మెల్యే ప‌ద్మారెడ్డికి ఈసారి మ‌హాకూట‌మిలో భాగంగా కాంగ్రెస్‌ టిక్కెట్ దొరుకుతుందో లేదో అనే టెన్షన్ ఓ వైపు ఉన్నా, ఆ విష‌యాన్ని ప‌క్కన పెట్టి భ‌ర్తకు అనుకూలంగా తెర‌ వెనుక వ్యూహాల్ని ర‌చించే ప‌నిలో బిజీ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో నెగ్గుకు రావాలంటే, కేవ‌లం ప‌ని చేయడం ఒక్కటే కాదు, సొంత పార్టీలోని ప్రత్యర్ధులకు ధీటుగా ఎత్తుగ‌డ‌లు ఉండాల‌న్న విష‌యం ఈ దంప‌తుల‌కు బాగా తెలుసు.

పిసిసి అధ్యక్ష హోదాలో ఉత్తమ్ కుమార్‌రెడ్డి స‌భ‌లు, టిక్కెట్లు, పొత్తుల చ‌ర్చలు ఇలా అనేక కార్యక్రమాల్లో బిజీగా ఉంటున్నారు. అయితే ఎప్పటిక‌ప్పుడు ఢిల్లీకి రిపోర్ట్‌లు పంప‌డం, ప్రత్యర్ధుల ప్రచారానికి కౌంట‌ర్‌గా సోష‌ల్ మీడియా టీమ్‌ని ప‌నిచేయించ‌డం ఇలాంటి కార్యక్రమాల‌న్నీ ప‌ద్మారెడ్డి చేస్తున్నారు. పార్టీతో నేరుగా సంబంధం లేకుండా ఒక సొంత సోష‌ల్ మీడియా టీమ్‌ని కూడా ఆమె మ్యానేజ్ చేస్తున్నారంటే ప‌ద్మారెడ్డి ఎంత సీరియ‌స్‌గా ఉన్నారో అర్ధం చేసుకోవ‌చ్చు. ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చే ప‌రిస్ధితి ఉంటే, ఉత్తమ్‌నే ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రొజెక్ట్ చేయ‌డానికి అవ‌స‌ర‌మైన స్కెచ్‌ని రూపొందించే ప‌నిలో కూడా ఆమె ఇప్పటినుంచి బిజీగా ఉన్నార‌ట‌.

Related News