చితికిన సిక్కోలుకు మా వంతుగా

‘తిత్లీ’ తుపానుకు కకావికలమైన శ్రీకాకుళం జిల్లాను ఆదుకునేందుకు టాలీవుడ్ ముందుకొస్తోంది. ఏపీ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిపై నందమూరి వారసులు ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్‌లు స్పందించారు. ఎన్టీఆర్ రూ. 15 లక్షలను, కల్యాణ్‌రామ్ రూ. 5 లక్షలకు సీఎం సహాయనిధికి పంపుతున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు ట్విట్టర్‌లో ఓ ప్రకటన వెలువడింది. తిత్లీతో దెబ్బతిన్న సిక్కోలు బాధితులను ఆదుకునేందుకు వినియోగించాలని వాళ్లు కోరారు.

ఇప్పటికే నటుడు విజయ్ దేవరకొండ తనవంతు సాయంగా రూ. 5 లక్షలు ప్రకటించగా, అంతకుముందు సంపూర్ణేష్‌బాబు తనవంతు సాయమందించిన విషయం తెల్సిందే!

 

Related News