మోదీవి దిగజారుడు మాటలు

అవిశ్వాసం సందర్భంగా లోక్‌సభలో ప్రధాని మోదీ మాట్లాడిన మాటలపై ఫైర్ అయ్యారు ఏపీ సీఎం చంద్రబాబు. ప్రధాని మోదీకి అహంకారం.. అధికారం వుందనే అహంకారంతో ఏం చేసినా ఫర్వాలేదని ముందుకు పోతున్నారని ధ్వజమెత్తారు. ఇది ‘మెజార్టీ వర్సెస్ మోరాల్టీ’ మధ్య పోరాటం, వాళ్లకు ఆధిక్యత వుందని, కానీ ధర్మాన్ని పాటింలేదన్నారు. మోదీ సర్కార్‌పై లోక్‌సభలో టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయిన అనంతరం శుక్రవారం రాత్రి అమరావతిలో మీడియాతో ఆయన మాట్లాడారు. సంఖ్యాబలం లేకపోతే అవిశ్వాసం ఎందుకు పెట్టారని మోదీ ప్రశ్నించడాన్ని ప్రస్తావించారు. రాష్ర్టం కోసం, హోదా కోసం అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాతనే చివరిగా అవిశ్వాసం పెట్టామన్నారు. సమస్యను అర్థం చేసుకుని పరిష్కారించాల్సిన ప్రధాని, సభలో ఆయన మాట్లాడిన తీరు చాలా బాధ కలిగిందని, తానేదో యూటర్న్‌ తీసుకున్నట్టుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

తనకు- తెలంగాణ సీఎం కేసీఆర్‌కు మధ్య గొడవులున్నాయన్నట్టుగా ప్రధాని మాట్లాడటం సరికాదన్నారు ఏపీ సీఎం. ప్రధానిగావున్న వ్యక్తి అంత దిగజారిపోయి మాట్లాడటం కరెక్ట్‌ కాదన్నారు. కాంగ్రెస్‌ అన్యాయం చేసిందని చెబుతున్న మీరు.. ఎక్కడ న్యాయం చేశారని ప్రశ్నించారు. కేంద్రంలో మా మంత్రులు రాజీనామాలు ఆమోదించే ముందు ప్రధాని తనకు ఫోన్‌ చేశారు.. మంత్రి పదవుల నుంచి వైదొలగినా, ఎన్డీయేలో భాగంగా ఉన్నామని, ఇప్పటికైనా పరిష్కారం చేయమని చెప్పాను. తాము ప్రభుత్వం నుంచి బయటకు వెళ్లడంవల్ల వైసీపీకి లాభం జరుగుతుందన్నట్టుగా ఆయన మాట్లాడారని, ప్రధాని స్థాయిలోవున్న వ్యక్తికి ప్రజల సమస్యల గురించి ఆలోచించాలే తప్ప, వాళ్లు పోటీగా ఉన్నారని చెప్పడం వెనుక అర్థం ఏమిటని దుమ్మెత్తిపోశారు. వాళ్లను అడ్డుపెట్టుకుని బ్లాక్‌మెయిల్‌ చేయడం ఆయనకు తగదన్నారు. పనిలోపనిగా అటు జగన్, ఇటు పవన్‌పైనా విరుచుకుపడ్డారు చంద్రబాబు. టీడీపీ అవిశ్వాస తీర్మానం పెడితే దేశమంతా తిరిగి, అందరినీ సమీకరిస్తామని చెప్పిన పవన్‌ కళ్యాణ్‌.. తనను విమర్శిస్తూ ట్వీట్స్‌ చేయడంపై మండిపడ్డారు.

READ ALSO

Related News